Skip to main content

పామో.. దోమో తెలీదు

  అంతర్వేదిలోనే ఆనందం - Antervedi comedian praveen ...
పామో.. దోమో తెలీదు 
యాస, టైమింగ్‌ కలిస్తే ఆ యాక్టర్‌ అదరగొడతాడు అనడానికి ప్రవీణ్‌ ఓ ఉదాహరణ. అలాగని కించపరిచేలా అతని యాస ఉండదు. చిన్నబుచ్చుకునేలా ఆహార్యం ఉండదు. సాధారణమైన డైలాగ్‌ కూడా ప్రవీణ్‌ నోట వస్తే అది పంచ్‌ అవుతుంది. వేషం ఏదైనా అందులో కామెడీ మిస్‌ కాదు. ప్రవీణ్‌ మార్క్‌ మిస్‌ అవ్వదు. కామెడియన్‌గా ఆకట్టుకుంటున్న ఆయన సెట్లో తన సహనటులతో జరిగిన కొన్ని ఫన్నీ విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు. 

విజయనగరంలో బొబ్బిలిరాజులు కట్టించిన ఓ గెస్ట్‌హౌస్‌లో ‘కార్తికేయ’ షూటింగ్‌ జరుగుతున్న సమయమది. నైట్‌ టైమ్‌ జోగినాయుడుని అడివిలో పరిగెత్తించే సీన్‌ తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్‌ కట్‌ చెప్పాడు. కాస్త రీలాక్స్‌ అయ్యాం. చీకట్లో నా కాలు మీద ఏదో పాకినట్లు అనిపించింది. అది చీమో, దోమో, పామో కూడా తెలీదు. ఒకవేళ పాము అయితే కాలు కదిపితే పరిస్థితి ఏంటి? ఇదే విజయాన్ని అతి భయస్తుడైన జోగినాయుడికి చెప్పా. ఆ మాట పూర్తిగా విన్నాడో లేదో కూడా తెలీదు చీకట్లో నన్నొక్కడినే వదిలేసి అక్కడి నుంచి మాయమైపోయాడు. కాసేపటికి కానీ సెట్‌లోకి రాలేదు. 
అదే ఊళ్లో వంశీగారు ‘సితార’ సినిమా తీసిన కోటలో మరో సీన్‌ షూటింగ్‌ చేశాం. రాత్రి తొమ్మిది గంటలకు ఓ సీన్‌ షూట్‌ చేస్తున్నాం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఒకతను వాళ్ల అమ్మగారు చేసిన  భోజనం తీసుకొచ్చాడు. అందరూ తింటుండగా పై నుంచి ఓ పసిరిపాము ప్లేట్‌లో పడింది. అందరి ప్లేట్‌లు గాల్లో ఎగురుతుంటే.. ఒకయన ‘షూటింగ్‌ జరుగుతున్నప్పుడు పాము పడితే సినిమా సూపర్‌హిట్‌ అంట’ అని విచిత్రంగా మాట్లాడాడు. ఓ పక్క మేం భయంతో వణికిపోతుంటే ఆ సిట్యువేషన్‌కి సంబంధంలేని అతని స్టేట్‌మెంట్‌కి నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. 

ఓసారి కృష్ణభగవాన్‌, ఎమ్మెస్‌గారు, నేను కూర్చునున్నాం. ఫోన్‌ రింగ్‌ అయింది. భగవాన్‌గారు మాట్లాడిపెట్టేశారు. ఫోన్‌ ఎవర్రా అని ఎమ్మెస్‌ అడిగారు. రఘుబాబు అన్నా.... అనగానే విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో ఏమన్నాడు అనడిగారు. ‘బృందావనంలో’ నీ క్యారెక్టర్‌ సూపర్‌ ఉందంట అనగానే ఓరేయ్‌ తింగరోడ అందులో నేను చెయ్యలేదురా’... అన్నాడు. వెంటనే కృష్ణభగవాన్‌గారు అందుకునే బావుందంటున్నాడు అన్నారు. దాంతో నిన్ను భగవంతుడు కూడా మార్చలేడని నవ్వుకున్నారు. 

కొందరు డైరెక్టర్‌లకు నా డైలాగ్‌ డెలివరీ బాగా నచ్చుతుంది. సీన్‌కి తగ్గట్టు సింక్‌అయ్యేలా నేనేదన్నా డైలాగ్‌ చెప్పి.. అది బావుంటే సీన్‌లో లేకపోయినా సినిమాలో పెట్టేవారు. అలా ‘కొత్తబంగారు లోకం’లో శ్రీకాంత్‌ అడ్డాలగారు కొన్ని డైలాగ్‌లు వాడారు. ‘ప్రపంచంలో ఉన్న వ్యవహారాలన్ని దీనికే కావాలిరా నా యాపారం తప్ప’ అని నేను లైనేసే అమ్మాయి గురించి మాట్లాడుతున్న సందర్భంగా ‘ఓరేయ్‌ అగాధం బాధపడకురా ప్రతి కుక్కకి ఓ రోజు వస్తాది’ అన్నది దర్శకుడు రాసి డైలాగ్‌ ఉంటుంది. అక్కడితో కట్‌ ఈ సీన్‌కి. దానిని కంటిన్యూ చేస్తూ... చిన్నప్పుడు అమ్మమ్మగారి ఇంట్లో కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చి.. ‘నువ్వేంట్రా కర్ణంగారి దొడ్లో ఆంబోతులా..’ అని ఒకటి, కొండ చీపుర్లు అమ్ముకునే మోహం ఇదీను అని సరదాగా నేను అన్న డైలాగ్‌లు అందరికీ నవ్వు రప్పించడంతో సినిమాలో పెట్టారు. 

www.filmibeat.com/img/popcorn/profile_photos/pr...

భోజనం సమయంలో.. కృష్ణభగవాన్‌గారు... ఇలా తింటూనే మా ఊళ్లో ఇద్దరూ... అని గ్యాప్‌ ఇచ్చారు. ఏమైంది అనేలోపు.. ఇద్దరు పోయారని సంకేతం ఇచ్చారు. మరోసారి నేను అన్నం తింటుంటే నన్ను ఉద్దేశించి ఇలా తింటూనే మా ఊళ్లో ఇద్దరు... అన్నారు.
దానికి సైటైర్‌గా ఇలా తింటూనే మా ఊళ్లో నలుగురు అని డైలాగ్‌ కంప్లీట్‌ చెయ్యలేదు’ నా పంచ్‌ ఆయనకి అర్థమయ్యి తర్వాతి రోజు నామీద భీభత్సమైన సెటైర్లు వేశారు.

Comments

Popular posts from this blog

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక