Skip to main content

Posts

Showing posts from June, 2020

ఆ రెండు సమస్యలతో బాధపడుతున్నా!

  స్టార్‌ కిడ్‌ అంటే.. కెరీర్‌ నల్లేరు మీద నడక అంటుంటారు! మొదట ఆ నడక నేర్వాలి, నిలవాలి, గెలవాలి! స్టార్‌కిడ్‌ అయినా సున్నా నుంచి మొదలుపెట్టి, పట్టుపట్టి గెలిచారు కమల్‌హాసన్‌ గారాలపట్టీ శ్రుతీహాసన్‌. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన సత్తా చాటుతున్నారు. లాక్‌డౌన్‌లో శ్రుతీ ఏం చేశారో ఆమె మాటల్లోనే... నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తికావొస్తుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఓ కథానాయిక పదేళ్లు కొనసాగిందంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో ముందు, వెనక చెడు ఏదో ఒక రూపంలో కూర్చుని ఉంటే, మంచి మాత్రం ఒంటరిగా మన పక్కన ఉంటుంది. అంటే 10మందిలో ఒకరిద్దరు మంచి మనసు ఎదుటివారిని అర్థం చేసుకునేవారు ఉంటారని నా ఉద్దేశం. నా దగ్గర మంచిగా మాట్లాడి.. పక్కకు వెళ్లి ఇంకోలా మాట్లాడిన వాళ్లని చాలామందిని చూశా. మొదటి మూడు సినిమాలకే ఆ విషయాలన్నీ గమనించాను కాబట్టే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండగలిగా.  తల పొగరు చూడలేదు... కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువ కమర్షియల్‌ సినిమాల వైపే అడుగులేశా. నేను ఇండిపెండెంట్‌గా ఆలోచించే అమ్మాయిని. ఆ టైమ్‌లో నన్ను ఎవరూ గైడ్‌ చేయలేదు. ప్రతి చిన్న విషయం కోసం నాన్నని అడగలేను. మొదట్లో    మెయిన్‌

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం