Skip to main content

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

Nithin Comes in The Way of Mega Hero
చొక్కాలు చింపుకోవడానికి రెడీ!



నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో... 
తెర వెనక మహా సిగ్గరి..
అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం...

హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు? 
థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది. 
పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు? 
యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా. 

‘భీష్మ’ ఏం చేస్తాడు?
ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది. 

‘లై’, ‘శ్రీనివాస కల్యాణం’.. ఫ్లాప్స్‌ తర్వాత ఇది కంఫర్టబుల్‌ జోన్‌ సినిమా అనుకోవచ్చా? 
‘లై’, ‘ఛల్‌ మోహనరంగా’, శ్రీనివాస కల్యాణం’ ఫ్లాపుల తర్వాత ఏడాది గ్యాప్‌ వచ్చింది. ఈ ఖాళీ సమయంలో నా బలం, బలహీనతలు ఏంటి? నేనేం చేయగలను? ప్రేక్షకులు నన్నెలా చూడాలనుకుంటున్నారు అన్న విషయాలపై దృష్టి పెట్టి, నాకు నేనే అనలైజ్‌ చేసుకున్నా. అప్పుడు ఈ కథ కరెక్ట్‌ అనిపించి ఓకే చేశా. ఫస్ట్‌ కాపీ కూడా చూసుకున్నాం. అందుకే కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నా. 

గ్యాప్‌ తీసుకున్నారా? వచ్చిందా? 
‘అల వైకుంఠపురములో’ చెప్పినట్లు గ్యాప్‌ నేను తీసుకున్నది కాదు.. అలా ఇచ్చారంతే(నవ్వుతూ). వరుసగా మూడు ఫ్లాప్‌ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఈ సారి కథ మీద బాగా వర్క్‌ చేశాం. షూటింగ్‌ మొదలుపెట్టాక మళ్లీ కథలో మార్పులు చేయడం లాంటివి లేకుండా బౌండెడ్‌ స్ర్కిప్ట్‌తో సెట్‌కి వెళ్లాలనుకున్నా. ఆ పనులన్నీ పూర్తయ్యే దాకా వెయిట్‌ చేశా. ఈ గ్యాప్‌లోనే చంద్రశేఖర్‌ ఏలేటి, ‘రంగ్‌ దే’ కథలు లాక్‌ చేశా.  

నితిన్‌ని పేరు విన్న ప్రతిసారీ పడిలేచిన కెరటంలా అనిపిస్తుంది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ రెండూ చూశారు. బ్యాడ్‌ ఫేజ్‌లో మీ ఆలోచనా రీతి ఎలా ఉంటుంది? 
నిజమే! పడిలేచిన కెరటం అని నాకూ అనిపిస్తుంటుంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే నేను చాలా పెద్ద విజయాలు చూశా. ఏడేళ్ల కాలంలో 11 ఫ్లాపు సినిమాలు నా ఖాతాలో ఉన్నాయి. ఆ టైమ్‌లో కొత్తదనం కోసం చాలా ప్రయత్నాలు చేశా. అయితే టైమ్‌ బాగోకపోతే ఏదీ కలిసి రాదని అర్థమైంది. హీరోగా ప్రేక్షకులు నన్ను అంగీకరించారు కాబట్టి కష్టపడితే మంచి రోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. ‘ఇష్క్‌’ నుంచి ‘అ..ఆ’ వరకూ మళ్లీ మంచి టైమ్‌ నడిచింది. ‘అ.ఆ’ లాంటి పెద్ద హిట్‌ తర్వాత స్ర్కీన్‌ప్లే బేస్డ్‌ సినిమా చేయాలని ‘లై’ చేశా. అది కొందమందికి నచ్చింది. మరికొందరికి అర్థం కాలేదు. నేనైతే మంచి ప్రయత్నం అని ఫీలై చేశా. కానీ ఆడలేదు. కొత్త జానర్‌ సినిమా నాకు సెట్‌ కాదని,  నాకు సేఫ్‌ జోన్‌ అయిన లవ్‌స్టోరీతో ‘ఛల్‌ మోహనరంగా’ చేశా. అదీ బెడిసికొట్టడంతో.. ఎప్పుడూ ట్రై చేయని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘శ్రీనివాస కల్యాణం’ కమిట్‌ అయ్యా. అదీ ఆడలేదు. అందుకే ఆరు నెలలు బాగా ఆలోచించి.. ‘దిల్‌’, సై సినిమా నుంచి నాకు ఫ్యాన్‌ అయిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ అంగీకరించా. కమర్షియల్‌ అంశాలతో చిన్న సందేశం, పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. నేను లో ఫేజ్‌లో ఉన్న ప్రతిసారీ నా కుటుంబ సభ్యులే నాకు అండగా నిలిచేవారు. 

నాన్నగారు ఎలాంటి సలహాలిచ్చేవారు?
‘అ ఆ’తో రూ.50 కోట్ల మార్కెట్‌కు చేరుకున్నా. ఆ తర్వాత ఫ్లాపులతో మళ్లీ పడిపోయా. ఇప్పుడు నా మార్కెట్‌ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నా. అందుకు నాన్న చాలా సలహాలిస్తున్నారు. ‘సాప్ట్‌ సినిమాలు చేయడం నీ స్ట్రెంగ్త్‌ కాదురా. క్యారెక్టర్‌ సాఫ్ట్‌గా ఉన్నా ఎనర్జీ కూడా ఉండాలి, మరీ అమాయకమైన పాత్రలు నీకు సెట్‌ కావు’ అని నాన్న సలహా ఇచ్చారు. నా స్నేహితులు కూడా అలాగే చెప్పారు. వాటిని సీరియస్‌గా తీసుకుని ముందడుగు వేస్తున్నా. టైమ్‌ బాగోకపోతే ఎంతమంది ఎన్ని సలహాలిచ్చినా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లాపులు తప్పవు. 

ఇండస్ట్రీలో మీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరు? 
ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో సినిమాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి చర్చించను. నేను పర్సనల్‌గా ఏదన్నా షేర్‌ చేసుకోవాలంటే వరుణ్‌ తేజ్‌ ఉన్నాడు. మేమిద్దరం చాలాకాలంగా స్నేహితులం. ఆ స్నేహంతోనే ‘గద్దలకొండ గణేశ్‌’లో కామియో రోల్‌ చేశా. వరుణ్‌తో ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతా. వారానికి ఒకసారి కలిసి మాట్లాడుకుంటాం. 

నితిన్‌లో మంచి వ్యాపారవేత్త ఉన్నట్టున్నాడు? 
లేదండీ! గతంలో స్నేహితులతో కలిసి టీ–గ్రిల్‌ రెస్టారెంట్‌ పెట్టా. అది నాకు సెట్‌ కాలేదు. సినిమాలతో బిజీగా ఉంటూ ఆ లెక్కలు చూసుకోవడం ఇబ్బందిగా ఉండి.. ఏడాది కాలంలో దాన్ని అమ్మేసా. ఇప్పుడు నాకూ, దానికి ఏ సంబంధం లేదు. టీ–గ్రిల్‌లో ఫుడ్‌ టేస్ట్‌ బాగున్నా, బాగోకపోయినా నాకు సంబంధం లేదు. 

నితిన్‌ ఫుడీనా? 
పిచ్చ ఫుడీని! ముఖ్యంగా ఇంటి ఆహారాన్నే ఎక్కువ ఇష్టపడతా. అన్నం తినడం స్టార్ట్‌ చేశానంటే తింటూనే ఉంటా. అన్నం, ఆవకాయ, ఆమ్లేట్‌, పప్పు అతి ఇష్టంగా తింటా. స్వీట్స్‌ అంటే ప్రాణం. ఇక బయటకు వెళ్తే చికెన్‌, మటన్‌, బటర్‌ చికెన్‌, బటర్‌ నాన్‌ ఇష్టంగా తింటా. వృత్తిరీత్యా స్లిమ్‌గా ఉండాలి కాబట్టి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటా. షూటింగ్‌ వర్క్‌ ఉందంటే చాలా లిమిటెడ్‌గా తింటా. 

అప్పట్లో ఎయిట్‌ ప్యాక్‌ చేశారు కదా. అసలు జిమ్‌లో ఎన్ని గంటలు కష్టపడేవారు? 
మనం ఎన్ని ప్యాక్‌లు చేసిన జిమ్‌ చేసేది మాత్రం గంట మాత్రమే. ఉదయం గంటసేపు వెయిట్స్‌, సాయంత్రం గంటపాటు ఆబ్స్‌, కార్డియోస్‌ చేసేవాణ్ణి. అక్కడ ఫుడ్‌ డైట్‌ చాలా ముఖ్యం. ‘విక్టరీ’ సినిమా టైమ్‌లో ఏడాదిన్నరపాటు మూడు పూట్ల చికెన్‌, 18 ఎగ్స్‌ వైట్స్‌ తీసుకునేవాణ్ణి. మరో ఫుడ్‌ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆ డైట్‌ అయిపోయాక నాకు చికెన్‌ ఐటమ్స్‌ చూస్తే డోకు వచ్చేది. నా ట్రైనర్‌ వంశీ పర్యవేక్షణలో ప్రతివారం నా డైట్‌ మారుతుంది. ఇప్పుడు వెయిట్స్‌ మానేసి, బాడీ లోపల ఫిట్‌గా ఉండేందుకు క్రాస్‌ఫిట్‌ ట్రైనింగ్‌లో ఉన్నా. పిల్లర్‌ స్ట్రాంగ్‌గా ఉంటే బిల్డింగ్‌ స్ట్రాంగ్‌గా ఉంటుందంటారు కదా? అందుకే కండలు పెంచడం తగ్గించి పిల్లర్‌ బలంగా ఉండేలా జిమ్‌ చేస్తున్నా. దానికి కావలసిన ప్రొటీన్స్‌, విటమిన్స్‌ అన్ని డైట్‌ రూపంలో వంశీ సజెస్ట్‌ చేస్తారు. నాకు సెలవు రోజున ఛీట్‌ మీల్స్‌ తీసుకోవాలి. కానీ ఆ రోజు మొత్తం ఛీట్‌ చేసి పొద్దున్నుంచీ సాయంత్రం దాకా పిజ్జాలు, బర్గర్‌లు, స్వీట్లు ఇలా అన్నీ తినేస్తా. 

Actor Nithin and Shalini Engagement Moments (Video) - Social News XYZ

పర్సనల్‌ లైఫ్‌ విషయానికొస్తే... నితిన్‌ ప్రేమలో పడ్డారంటే నమ్మసఖ్యంగా లేదు? 
బేసిగ్గా నేను సిగ్గరిని కాబట్టి అందరికీ అలాగే అనిపిస్తుంది. ప్రేమలో పడడం అనేది అలా 
జరిగిపోయిందంతే! ఈ విషయం ఎవరికీ తెలీదు. తన పేరు షాలిని. తను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! మధ్యలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేయడానికి లండన్‌ వెళ్లింది. 2012 అంటే దాదాపు 8 ఏళ్లుగా ఆమె తెలుసు. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం, స్నేహంగా మారింది. ఒకరినొకరం అర్థం చేసుకున్నాక కొన్నాళ్లకు ఆ స్నేహబంధం కాస్తా ప్రేమగా మారింది. మా ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు తెలియకుండా ఏడేళ్లు మేనేజ్‌ చేశాం. ఏడాది క్రితమే ఈ విషయాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాలని మా ఇంట్లో చెప్పాను. సినిమాల్లోలాగా ఎటువంటి అడ్డంకులు, ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా కూల్‌గా అంగీకరించారు. అమ్మాయి వైపు కూడా అంగీకారమే! మా ఇంట్లో అయితే నేను పెళ్లి చేసుకోవడమే ముఖ్యం. అందుకే మరో మాట లేకుండా ఓకే చేసేశారు. 
అంత సీక్రెట్‌గా ఎలా ఉంచగలిగారు. 
అలా ఇద్దరం ప్లాన్‌ చేసుకున్నాం. అన్నీ కలిసొచ్చాయి. నాకున్న ఇబ్బందుల వల్ల తనని బయటకు తీసుకెళ్లలేను. ఎవరన్నా చూశారంటే సోషల్‌ మీడియాలో రచ్చరచ్చే. నాకు షూటింగ్‌ లేని సమయంలో కార్లో లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లడం, డ్రైవ్‌ ఇన్స్‌లో కూర్చుని తినడం, హయత్‌ హోటల్‌లో పైన ఓ రెస్టారెంట్‌ ఉంది.. అక్కడ తప్ప ఇంక ఎక్కడా కలిసేవాళ్లం కాదు. జనరల్‌గా లవర్స్‌ అంటే సినిమాలకు వెళ్లాలి, ప్రియుడి చెయ్యి పట్లుకు తిరగాలి అని ఉంటుంది. పాపం షాలినికి అలాంటి ఛాన్స్‌ ఎక్కడా దొరకలేదు. చాలాసార్లు బయటికి తీసుకెళ్లమని అడిగింది. నాకున్న ప్రాబ్లమ్స్‌తో కుదరలేదు. ఇద్దరి ఇళ్లల్లో ఎవరికీ తెలీదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాన్ని తనకు చెబితే అర్థం చేసుకుంది. 

బాక్స్‌: మొదట ప్రపోజ్‌ చేసిందెవరు? 
ప్రేమలో ఉన్నామనే విషయం ఇద్దరికీ తెలుసు. ప్రపోజల్‌ విషయానికొస్తే... నిజాయతీగా చెప్పాలంటే నేనే చేశా. అది కూడా వైరైటీగా. అందరూ మోకాలి మీద కూర్చుని పువ్వు ఇచ్చి ప్రపోజ్‌ చేస్తారు కదా. నేను కొత్త స్టైల్లో.. ఒంటి కాలు పైకిలేపి ఒంగి ప్రపోజ్‌ చేశా. తను నవ్వుకుంటూ నా ప్రేమను అంగీకరించింది. తను సినిమాలు చాలా తక్కువ చూస్తుంది. నేను పరిచయం అయ్యాక నా సినిమాలు చూడడం మొదలుపెట్టింది. ఇప్పుడు హిట్‌ సినిమాలన్నీ చూస్తుంది. ‘ఇష్క్‌’ సినిమా అంటే తనకు చాలా ఇష్టం. 


షాలినిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? 
మొదట నన్ను బాగా అర్థం చేసుకుంది. ఎనిమిదేళ్లు ఎవరికీ తెలియకుండా, స్నేహితులకు చెప్పకుండా, నేను తన కోసం సమయం కేటాయించకపోయినా ఎంతో ఓర్పుగా ఉంది. నేను హీరోని కాబట్టి  ప్రైవసీ సమస్య ఉంటుంది. తనకు అలా ఏం ఉండదు కదా? అయినా నా కోసం ఎంతో సహనంతో ఎదురు చూసింది. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మాయి పెళ్లి విషయంలో పెద్దలు ఒత్తిడి చేస్తారు కదా? వాటిని కూడా తను దాటుకొచ్చింది. అన్ని రకాలుగా నన్ను అర్థం చేసుకుంది. ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే.. ఆఫీస్‌ బాయ్‌ నుంచి బాస్‌ వరకూ అందర్నీ ఒకేలా ట్రీట్‌ చేస్తుంది. 

 కాలేజ్‌ స్టూడెంట్‌గా చేయబోయేది ఏ సినిమాలో? 
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘రంగ్‌దే’ సినిమాలో స్టూడెంట్‌గా కనిపిస్తా. ‘రంగ్‌దే’ కథ చెప్పినప్పుడు ‘స్టూడెంట్‌గా నేను సరిపోతానా’ అని వెంకీని అడిగా. ‘నన్ను గుడ్డిగా నమ్ము. నేను చూసుకుంటా’ అన్నాడు. తర్వాత కృష్ణ చైతన్యతో ‘పవర్‌ పేట’ సినిమా చేయబోతున్నా. పెద్ద స్పాన్‌ ఉన్న కథ. రెండు పార్టులుగా తీయబోతున్నాం. కథ కూడా రెడీగా ఉంది. 1960–2020 వరకూ నడిచే సినిమా నా కెరీర్‌లో మోస్ట్‌ యాంబిషియస్‌ సినిమా అవుతుంది. ఇందులో 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల ముసలాడిగా కనిపిస్తా. నా కెరీర్‌కి అరుదైన సినిమా ఇది. ఇప్పుడు సెట్‌ మీదున్న మూడు సినిమాలు పూర్తి చేసి ‘పవర్‌ పేట’ షూటింగ్‌కు వెళ్తా. ఆ తర్వాత మేర్లపాక గాంధీతో ‘అంధాధూన్‌’ రీమేక్‌ చేస్తున్నా.  

అసలు క్షమించరు!
మా అక్క, బావ నాకు బెస్ట్‌ క్రిటిక్స్‌. వీరిద్దరూ ఏదైనా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ప్రేమ కొద్దీ అక్క అప్పుడప్పుడూ కాస్త పాజిటివ్‌గా చెబుతుంది. కానీ మా బావ అయితే అసలు మోహమాటపడరు.. నా స్నేహితుడు క్రాంతి కూడా అంతే. ‘ఏంట్రా ఫాల్త్‌గా చెత్త సినిమా చేసినవ్‌’ అంటూ తిడతాడు. ఆ మాటలు హర్టింగ్‌గా ఉంటాయి కానీ అదే నిజం. అలాంటి వాళ్లు ఉంటేనే మన తప్పులు తెలుస్తాయి. 
Rangde (2020) | Rangde Movie | Rangde Telugu Movie Cast & Crew ... 

 చొక్కాలు చింపుకోవడానికి రెడీ!
నా అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌గారు మళ్లీ సినిమాలు చేయడం అభిమానిగా ఎంతో ఆనందిస్తున్నా. మేమంతా చొక్కాలు, పేపర్లు చింపుకొని థియేటర్‌లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాం.

Comments

Post a Comment

Popular posts from this blog

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక