Skip to main content

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ  పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

Happy Birthday Anupama Parameswaran: 5 best movies of the actress ...
చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.  అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు 

కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు. 

అల్లరి అంటే నాపేరే..
మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దింది లేదు. ఎంత అల్లరి చేసే దాన్నో.. అంతే బాగా చదివేదాన్ని. హాస్టల్‌లో ఏదన్నా ఇష్యూ జరిగితే.. మొదట నా పేరే వినిపించేది, ‘ఇది చేసింది నువ్వేనా’ అంటూ టీచర్స్‌ నన్నే పిలిచేవారు.  అలాగని నన్ను ఇష్టపడనివారు లేరు. నేను చాలా యాక్టివ్‌. చదువుతోపాటు ఇతర కల్చరల్‌ యాక్టివిటీస్‌లో కూడా యాక్టివ్‌గా ఉండేదాన్ని. మ్యూజిక్‌, పాటలు, యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. టెన్త్‌, ఇంటర్‌ టైమ్‌లో డ్రామాల్లో కూడా నటించా. అప్పటి నుంచీ నటన మీద ఆసక్తి పెరిగింది. ఇక చదువు విషయానికొస్తే... మాస్‌ మీడియా కమ్యూనికేషన్స్‌ చేసి పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగంలో ఉండాలనుకునేదాన్ని. డిగ్రీలో ఉండగా మలయాళ ‘ప్రేమమ్‌’ సినిమా ఆఫర్‌ వచ్చింది. రెండింటికీ టైమ్‌ కుదరకపోవడంతో చదువు ఆపేశా. మళ్లీ ఇప్పుడు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేస్తున్నా. ఇప్పుడూ టైమ్‌ కొంచెం కష్టంగానే ఉంది. కానీ చదువు కూడా చాలా అవసరమే కదా. 

అదొక పెద్ద స్టోరీ...
సినిమాల్లోకి రావడం వెనుక పెద్ద స్టోరీ ఉంది. నేను ఇంటర్‌ చదువుతున్నప్పుడు మలయాళ నటుడు, నిర్మాత నివిన్‌ పాలీ ‘ప్రేమమ్‌’ సినిమాకు ఒక హీరోయిన్‌ కావాలని ఫేస్‌బుక్‌లో కాస్టింగ్‌ కాల్‌ స్టేటస్‌ పెట్టాడట. నా కాలేజ్‌ ఫ్రెండ్‌ అర్చన అది చూసి నన్ను అడగకుండానే.. నా ఫొటోల్ని ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కి పంపించింది. పది రోజల తర్వాత ఆడిషన్‌కి రమ్మని పిలుపొచ్చింది. అప్పటి వరకూ నా స్నేహితురాలు ఫొటోలు పంపిన విషయం కూడా నాకు తెలీదు. అదే విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పి ‘నన్నేం చెయ్యమంటారు’ అనడిగా.  సినిమా పరిశ్రమకు ఏ సంబంధం లేని అమ్మాయికి ఆడిషన్‌, సినిమాల్లో అవకాశం అనగానే కాస్త భయమేసి కోపంతో నన్ను బాగా తిట్టారు. కానీ రెండు రోజలు తర్వాత ఆడిషన్‌కి అంగీకరించి దగ్గరుండి తీసుకెళ్లారు. అదే నా ఫస్ట్‌ ఆడిషన్‌. హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యా. ‘ప్రేమమ్‌’ సినిమా అవకాశం వచ్చింది. అంతకుముందు కెమెరా ముందు పని చేసిన అనుభవమూ లేదు. అయినప్పటికీ కెమెరా ఫియర్‌ లేకుండా యాక్ట్‌ చేశా. ఆ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ అయినప్పుడు నేను హస్టల్‌ల్లో ఉన్నా. చూడ్డానికి కుదరలేదు. అమ్మానాన్న చూసి ‘అమ్మాయి మనతో లేదే...’ అని చాలా బాధపడ్డారు. ఈ విషయాలన్నీ తర్వాత తమ్ముడు చెబితే తెలిసింది. వాళ్లకు నా మీద ఎంత ప్రేమ ఉందో పూర్తిగా తెలిసింది.
అవకాశాలు రాలేదు...
ప్రేమమ్‌ సినిమా పూర్తయ్యి రిలీజ్‌ కావడానికి రెండేళ్లు పట్టింది. అది హిట్‌ అయినప్పటికీ వెతుక్కుంటూ అవకాశాలు రాలేదు. నెక్స్‌ ఏంటి? అన్న ఆలోచనతో చాలా భయపడ్డా. రెండో సినిమా సైన్‌ చెయ్యడానికి ఏడాది టైమ్‌ పట్టింది. ఆ తర్వాత తెలుగులో ‘అ..ఆ’, ప్రేమమ్‌’, తమిళంలో ‘కోడి’, తెలుగులో ‘శతమానం భవతి’ వంటి మంచి అవకాశాలొచ్చాయి. 
Bubbly Anupama Parameswaran turns calm


ఫోన్‌ వస్తే ఆశ్చర్యపోయా!
‘అ.. ఆ’ అవకాశం ఓ సర్‌ప్రైజ్‌. ఓ రోజు ఇంటి దగ్గర కూర్చొని మళ్లీ ఆలోచిస్తుంటే రచయిత, దర్శకుడు తివిక్రమ్‌గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆయనతో నాకు ముఖ పరిచయం లేదు. కానీ ఆ పేరు నాకు బాగా తెలుసు. అదే సమయంలో నేను ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా చూశా. ఒక్కసారిగా ఆయన్నుంచి ఫోన్‌ వచ్చేసరికి ఆశ్చర్యపోయా. ఎవరో ఏడిపించడానికి చేసిన కాల్‌ ఏమో అనుకున్నా. ‘ఓ కథ చెప్పాలి.. చెన్నైలో మీట్‌ అవుదాం’ అని చెప్పారు. నాన్న వాళ్లతో చెప్పి చెన్నైలో కథ విన్నా. నాగవల్లి పాత్రేమో నెగిటివ్‌గా ఉంది. ‘నేనేదో ‘ప్రేమమ్‌’లో సాఫ్ట్‌ క్యారెక్టర్‌ చేశా! ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్‌ నేనెలా చెయ్యగలను సార్‌’ అనడిగితే.. ‘నువ్వు చెయ్యగలవ్‌’! అని భరోసా ఇచ్చారు. నాగవల్లి పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించా. నా క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ కూడా నేనే చెప్పా. ‘అ..ఆ’ తెలుగులో మంచి లాంచ్‌ నాకు. మాతృభాషలో హిట్టైన సినిమా కంటే ‘అ..ఆ’కు వచ్చిన స్పందన చూసి అమ్మానాన్న తెగ మురిసిపోయారు. 

అ..ఆ’ జ్ఞాపకాలు...
‘అ.. ఆ’ సమయంలో మరచిపోలేని మెమరీ ఒకటుంది. ఆ సినిమా సక్సెస్‌ మీట్‌ నుంచి ఇంటికి వెళ్తుంటే చాలామంది ఫ్యాన్స్‌ నా కార్‌ వెనకే ఫాలో అయ్యారు. కార్‌ ఆపగానే వాళ్లంతా ‘మేడమ్‌ ఒక్క ఫొటో ఫ్లీజ్‌’ అనగానే వాళ్లు చూపించిన అభిమానానికి నా కళ్లు చమర్చాయి. ఓ ఐదేళ్ల పిల్లాడు దగ్గరికి వచ్చి ‘అక్కా నిన్నొకసారి టచ్‌ చెయ్యొచ్చా’ అనడిగాడు. ‘ఓకే టచ్‌ మీ’ అనగానే ఆ అబ్బాయి నా బుగ్గల్ని టచ్‌ చేసి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. ఒక చిన్న పిల్లాడు నా మొదటి సినిమాకే అంత అభిమానించడం చూసి ఆశ్చర్యపోయా. 

నాలో మార్పు తెచ్చిన పాత్ర!
జనరల్‌గా చేసిన పాత్రనే మళ్లీ చెయ్యడానికి కొందరు ఇష్టపడరు. కానీ నాకెందుకో తెలుగులో ‘ప్రేమమ్‌’ చెయ్యడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నా పాత్రలో ఎలాంటి మార్పులేదు కానీ కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేశారు. మొదటి సినిమా కాబట్టి మలయాళ ‘ప్రేమమ్‌’ ఎప్పుడూ స్పెషల్‌ నాకు. ఆ తర్వాత ‘శతమానం భవతి’లో చేసిన నిత్యా పాత్ర కూడా ప్రత్యేకమే. 

ఎందుకు ‘నో’ అన్నారో..?
రాంచరణ్‌తో ఓ సినిమా అవకాశం వచ్చింది. కథ వినడం అన్నీ జరిగాయి. ఇక సైన్‌ చెయ్యడం ఒకటే ఆలస్యం. ఆ టైమ్‌ వచ్చేసరికి నో అన్నారు. కారణం ఏంటో కూడా తెలీదు. రెమ్యూనరేషన్‌ సమస్య కూడా లేదు. రీజన్‌ ఏంటో తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.

ఎప్పుడూ క్వశ్చన్‌ మార్కే...
నేనెప్పుడూ క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌తోనే ఉంటా. రైటర్‌ ఒక డైలాగ్‌ రాస్తే ఎందుకిలా రాశారు. కెమెరా వైడ్‌ యాంగిల్‌ పెడితే ఎందుకలా పెట్టరు? నిమ్మకాయ పుల్లగా ఎందుకుంటుంది? ఆపిల్‌ తియ్యగా కాకుండా చేదుగా ఎందుకు ఉండదు? భోజనంలో పప్పు పెట్టకపోయినా, పిజ్జా ఇవ్వకపోయినా ఈ రోజు నాకెందుకు ఇవన్నీ పెట్టలేదు! ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయి. డౌట్‌ ఉన్న చోట ఇంప్రూవ్‌మెంట్‌ ఉంటుందని నా నమ్మకం. 

చిన్న పాపలా చూస్తారు..

ప్రతి పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ జరుగుతుందని విన్నాను. అలాంటివి నా వరకూ రానివ్వను. ఇప్పటి వరకూ నేను పనిచేసిన ప్రతి సినిమా టీమ్‌ కెమెరా ముందు ఉన్నప్పుడు నన్ను హీరోయిన్‌ అనుకుంటారు. పేకప్‌ చెప్పాక.. అందరూ చిన్నపిల్ల, పాప, చిట్టిపొట్టి అని పిలుస్తు ఏంజల్‌ లాగా చూస్తారు. ఐస్‌క్రీం, లాలీపాప్‌ తీసుకొచ్చి ఇస్తారు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా. 

ఒక్క సీన్‌ అయినా ఓకే...దర్శకుల్లో రాజమౌళి గారితో ఒక్క సినిమా అయినా చెయ్యాలనుంది. ఇది కాకుండా నిమిషం సీన్‌ దొరికినా చిరంజీవిగారి సినిమాలో యాక్ట్‌ చెయ్యాలనుంది. ఆయన 150 సినిమాలు చేసి ఇంకా కంటిన్యూ కావడమంటే మామూలు విషయం కాదు. ‘ఖైదీ నంబర్‌ 150’ చూశా. అబ్బబ్బా ఆయన డాన్స్‌ ఎనర్జీ చూసి అదిరిపోయాను. అందుకే ఆయన సినిమాలో ఎనీ క్యారెక్టర్‌ చెయ్యడానికి రెడీ.

ఆ భావన రాలేదు..జీవితంలో పాజిటివ్‌, నెగిటివ్‌ రెండూ ఉంటాయి. అవన్నీ కూడా మంచి అనుభవమే అనుకోవాలి కానీ.. ఇబ్బందిగా భావించకూడదు. ఈ మూడేళ్లలో సినిమాల్లోకి ఎందుకు వచ్చానా అన్న భావన ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, ఓర్పు ఎక్కువ. కష్టపడే తత్వం కూడా ఉంది. ఇవన్నీ సినిమాకు తప్పనిసరిగా కావాలి. నాలో అవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను చెయ్యగలననే నమ్మకం ఉంది. ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే మీడియా రిలేటెడ్‌ వర్క్‌ చెయ్యాలి అనే నా డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్‌ చేసుకునేదాన్ని. 

పర్సనల్‌ టచ్‌: 
గ్లామర్‌ అంటే...
నా దృష్టిలో స్కిన్‌ షో వేరు, గ్లామర్‌ వేరు. శారీ వేసుకుని వచ్చి ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యూటిఫుల్‌ అనిపిస్తే దాన్ని గ్లామరస్‌ అంటాం. అదే మన అమ్మా, చెల్లి చీర కట్టుకుని బస్సులో వెళ్తూ యాక్సిటెండల్‌గా నడుము కనిపిస్తే దాన్ని గ్లామర్‌ అనకూడదు. ఇప్పటి వరకూ అయితే నేను స్కిన్‌ షో చెయ్యలేదు. చెయ్యలేనేమో! 

ఫుడ్‌ అంటే పిచ్చి...
అమ్మ తయారు చేసినా ఏ వంటకమైనా నాకు ఇష్టమే. చాలా రకాల కూరగాయలతో అమ్మ చేసే ‘సద్యా’ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్‌లో అయితే..అన్నం, పప్పు, పెరుగు, చికెన్‌ కర్రీ, అప్పడం ఉందంటే చాలు ఇంకేం అవసరం లేదు. ఇదే ఫుడ్‌ రోజుకి మూడుసార్లు పెట్టినా లాగించేస్తా. 
Anupama Parameswaran, Raj Tarun team up for 'Shatamanam Bhavati ...
నాగవల్లిగా మారతా...

ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచీ పెద్దవారిదాకా ఎవరితోనైనా నేను మాట్లాడగలను. నా నోరు అస్సలు ఖాళీగా ఉండదు. నాలో మైనస్‌ పాయింట్‌ అంటే కోపం ఎక్కువ. అదెప్పుడంటే.. మనం కరెక్ట్‌గా పనిచేసి తోటివారు సరిగ్గా చెయ్యకపోతే అందరికీ చివాట్లు పడతాయి కదా అప్పుడు కోపాన్ని ఆపుకోలేను. ఒక్కసారిగా నాగవల్లిగా మారిపోతా. సెట్‌ టైమ్‌కి వెళ్లడం, చెప్పిన పని పర్ఫెక్ట్‌గా చెయ్యడం నాకు అలావాటు. నా కోపం పాసింగ్‌ క్లౌడ్‌ లాంటిది. 

హెయిర్‌ సీక్రెట్‌...
నాకు పొడవైన హెయిర్‌ అంటే చాలా ఇష్టం. ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌లో అలా మెయిన్‌టెన్‌ చెయ్యడం చాలా కష్టం. నేను మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. కొబ్బరి నూనె ఎక్కువగా ఉపయోగిస్తా. ప్రతిరోజు తల స్నానం చేస్తా. 

హైట్‌ అడ్వాంటేజే...
నాలో బెస్ట్‌ ఫీచర్‌.. నా కళ్లు, నవ్వు చాలామంది చెబుతుంటారు. హైట్‌ తక్కువ అని చాలాసార్లు అనిపించింది. ‘శతమానంభవతి’, సమయంలో శర్వా చాలా ఏడిపించేవాడు. నాని పొట్టి అని పిలుస్తాడు. కొన్నిసార్లు నా హైట్‌ నాకు అడ్వాంటేజ్‌గానే అనిపిస్తుంది. ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తామనిపిస్తే హైట్‌ గురించి పట్టించుకోరు. 
ఆ భయం లేదు...
ప్రతి ఇండస్ట్రీలో పోటీ అనేది సహజం. టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మధ్యకాలంలో మలయాళం నుంచీ నేనూ, నివేధ థామస్‌, కీర్తి సురేశ్‌, అను ఇమాన్యూయేల్‌, మేఘా ఆకాశ్‌ ఇలా చాలామంది వచ్చాం. ఎవరి టాలెంట్‌ వాళ్లది. ఒకరు ఎదుగుతుంటే ఈర్ష్య పడటం నాకు తెలీదు. ‘ఒక అమ్మాయిని మరో అమ్మాయిని అప్రిషియేట్‌ చెయ్యదు’ అని అంటారు. కానీ నేను అలా కాదు.. ‘నిన్నుకోరి’ చూసి నివేధాకు ఫోన్‌ చేసి ప్రశంసించా. ఇక సాయి పల్లవి నాకు చాలా స్పెషల్‌. ‘ప్రేమమ్‌’కి ఫస్ట్‌ తనే ఎంపికైంది. ఆ తర్వాతే నేనొచ్చా. నా నంబర్‌ తీసుకుని ఫోన్‌ చేసి ఎక్కువ సేపు మాట్లాడుతుండేది.  తను నాకు అక్కలాంటిది. ‘ఫిదా’ చూసి సాయి  పల్లవితో ఎంత సేపు మాట్లాడానో నాకే తెలీదు.  ‘శతమానం భవతి’ చూసి సాయి నాకు కాల్‌ చేసింది. మా అందరి మధ్య హెల్దీ రిలేషన్‌ ఉంది. 
ఆ బాధ్యత ఉంది..
ఒక ఆడపిల్లగా పుట్టి సాటి ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే ఆలోచించకుండా ఎలా ఉంటామండీ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తే చాలా బాధ కలుగుతోంది. మనిషి అన్నాక మంచీ, చెడూ రెండు ఉంటాయి. వంద మందిలో 90 మంది మంచివాళ్లే ఉంటారు. 10 మంచి మాత్రం చెడ్డవారుంటారు. వారి వల్ల మొత్తానికి చెడ్డ పేరొస్తుంది. చట్టం, న్యాయవ్యవస్థ మారితేనే కానీ ఈ అన్యాయాలను అరికట్టడం కష్టం. 

చదువుకుని ఏ జాబ్‌లోకి వెళ్లినా కూర్చోని పనిచెయొచ్చు. కానీ యాక్టర్స్‌ అలా కాదు. ఎండైనా, వానైనా, చలి అయినా, జ్వరం వచ్చినా పని చెయ్యక తప్పదు. అందుకే యాక్టర్స్‌ ఎలాంటి కష్టానైనా తట్టుకోగలరు. అందుకే మేం చాలా లక్కీ అండీ. ఎక్కువ సినిమాలు చెయ్యాలనే టార్గెట్‌ ఏమీలేదు కానీ సిగ్నేచర్‌ క్యారెక్టర్స్‌ చెయ్యాలి. డిఫరెంట్‌గా ఉండాలి. సినిమా సక్సెస్‌ అయితే హిట్‌ హిట్‌ హుర్రే, ఫెయిల్‌ అయితే.. ఇంకా హార్డ్‌ వర్క్‌ చెయ్యాలి అనుకుంటా. 


Comments

Post a Comment

Popular posts from this blog

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక