Skip to main content

Posts

Showing posts from July, 2020

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక

పామో.. దోమో తెలీదు

   పామో.. దోమో తెలీదు  యాస, టైమింగ్‌ కలిస్తే ఆ యాక్టర్‌ అదరగొడతాడు అనడానికి ప్రవీణ్‌ ఓ ఉదాహరణ. అలాగని కించపరిచేలా అతని యాస ఉండదు. చిన్నబుచ్చుకునేలా ఆహార్యం ఉండదు. సాధారణమైన డైలాగ్‌ కూడా ప్రవీణ్‌ నోట వస్తే అది పంచ్‌ అవుతుంది. వేషం ఏదైనా అందులో కామెడీ మిస్‌ కాదు. ప్రవీణ్‌ మార్క్‌ మిస్‌ అవ్వదు. కామెడియన్‌గా ఆకట్టుకుంటున్న ఆయన సెట్లో తన సహనటులతో జరిగిన కొన్ని ఫన్నీ విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు.  విజయనగరంలో బొబ్బిలిరాజులు కట్టించిన ఓ గెస్ట్‌హౌస్‌లో ‘కార్తికేయ’ షూటింగ్‌ జరుగుతున్న సమయమది. నైట్‌ టైమ్‌ జోగినాయుడుని అడివిలో పరిగెత్తించే సీన్‌ తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్‌ కట్‌ చెప్పాడు. కాస్త రీలాక్స్‌ అయ్యాం. చీకట్లో నా కాలు మీద ఏదో పాకినట్లు అనిపించింది. అది చీమో, దోమో, పామో కూడా తెలీదు. ఒకవేళ పాము అయితే కాలు కదిపితే పరిస్థితి ఏంటి? ఇదే విజయాన్ని అతి భయస్తుడైన జోగినాయుడికి చెప్పా. ఆ మాట పూర్తిగా విన్నాడో లేదో కూడా తెలీదు చీకట్లో నన్నొక్కడినే వదిలేసి అక్కడి నుంచి మాయమైపోయాడు. కాసేపటికి కానీ సెట్‌లోకి రాలేదు.  అదే ఊళ్లో వంశీగారు ‘సితార’ సినిమా తీసిన కోటలో మరో సీన్‌ షూటింగ్‌ చేశాం. రాత్రి

నా కళ్లు.. నా నవ్వే నాకు ప్లస్

‌                     నా కళ్లు.. నా నవ్వే నాకు ప్లస్‌ – అనూ ఇమ్మాన్యూయేల్‌         హాయ్‌ అనూ ఎలా ఉన్నారు?  ఐయామ్‌ గుడ్‌ అండీ.  మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?  నాన్న తంగచ్చిన్‌ ఇమ్మాన్యుయేల్‌ కేరళలోని కొట్టాయంకు చెందిన వ్యక్తి. అమ్మ అక్కడే ఓ ఆసుపత్రిలో ఉద్యోగి. కొంతకాలం అమెరికాలో ఉన్నాం. నేను పుట్టి పెరిగిందీ, చదువుకుందీ అంతా అమెరికాలోనే! నాకొక అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాడు. నాన్నకు, నాకూ సినిమాలంటే పిచ్చి. ఆయన మలయాళ చిత్రాల నిర్మాత కూడా. ఆరేడేళ్ల వయసు నుంచీ నాకు సినిమాల్లో నటించాలని ఆశ. చిన్నప్పటి నుంచీ నాన్నంటే చాలా భయం. అందుకే సినిమాల ప్రస్తావన ఆయన దగ్గర తీసుకురాలేదు. 2011లో నాన్న నిర్మించిన ‘స్వప్న సుందరి’ సినిమాలో హీరోకి కూతురిగా నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కోసం డల్లాస్‌ నుంచీ కేరళకు వచ్చా. ఎందుకో ఆ షూటింగ్‌ను, సినిమానూ ఎంజాయ్‌ చెయ్యలేకపోయా. లాభం లేదనుకుని అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశా. అక్కడే చదువు కంటిన్యూ చేశా.  హీరోయిన్‌గా మీ ఎంట్రీ ఎలా జరిగింది?  ఓ సందర్భంలో నాన్నకు తెలిసిన ఓ మ్యాగజైన్‌ ఎడిటర్‌తో మాట్లాడి నా ఫొటోని కవర్‌ పేజీగా వేయించారు. ఆ ఫొటో