Skip to main content

నా కళ్లు.. నా నవ్వే నాకు ప్లస్

South siren Anu Emmanuel's Instagram pics raise the temperature ...
‌                    



నా కళ్లు.. నా నవ్వే నాకు ప్లస్‌ – అనూ ఇమ్మాన్యూయేల్‌        

హాయ్‌ అనూ ఎలా ఉన్నారు? 
ఐయామ్‌ గుడ్‌ అండీ. 
మీ ఫ్యామిలీ గురించి చెబుతారా? 
నాన్న తంగచ్చిన్‌ ఇమ్మాన్యుయేల్‌ కేరళలోని కొట్టాయంకు చెందిన వ్యక్తి. అమ్మ అక్కడే ఓ ఆసుపత్రిలో ఉద్యోగి. కొంతకాలం అమెరికాలో ఉన్నాం. నేను పుట్టి పెరిగిందీ, చదువుకుందీ అంతా అమెరికాలోనే! నాకొక అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నాడు. నాన్నకు, నాకూ సినిమాలంటే పిచ్చి. ఆయన మలయాళ చిత్రాల నిర్మాత కూడా. ఆరేడేళ్ల వయసు నుంచీ నాకు సినిమాల్లో నటించాలని ఆశ. చిన్నప్పటి నుంచీ నాన్నంటే చాలా భయం. అందుకే సినిమాల ప్రస్తావన ఆయన దగ్గర తీసుకురాలేదు. 2011లో నాన్న నిర్మించిన ‘స్వప్న సుందరి’ సినిమాలో హీరోకి కూతురిగా నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కోసం డల్లాస్‌ నుంచీ కేరళకు వచ్చా. ఎందుకో ఆ షూటింగ్‌ను, సినిమానూ ఎంజాయ్‌ చెయ్యలేకపోయా. లాభం లేదనుకుని అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశా. అక్కడే చదువు కంటిన్యూ చేశా. 

హీరోయిన్‌గా మీ ఎంట్రీ ఎలా జరిగింది? 
ఓ సందర్భంలో నాన్నకు తెలిసిన ఓ మ్యాగజైన్‌ ఎడిటర్‌తో మాట్లాడి నా ఫొటోని కవర్‌ పేజీగా వేయించారు. ఆ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దాన్ని చూసి మలయాళ హీరో నివిన్‌ పాల్‌ నన్ను సంప్రతించారు. స్కైప్‌లో ఆడిషన్‌ చేసి ‘యాక్షన్‌ హీరో బిజు’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. అలా కథానాయికగా మొదటి అవకాశం అందుకున్నా. అప్పటికీ నాకు నటన మీద అంతగా అవగాహన లేదు. ఏదన్నా చెయ్యాలని గట్టిగా సంకల్పించుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మొదటి అవకాశం అందుకున్నాక అర్థమైంది.   

తొలి తెలుగు అవకాశం ఎలా వచ్చింది? 
తెలుగులో నేను సైన్‌ చేసిన మొదటి సినిమా ‘ఆక్సిజన్‌’. విడుదలైంది మాత్రం నానితో నటించిన ‘మజ్ను’. ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటోలు చూసి విరించి వర్మ ఆడిషన్‌ చేశారు. అందులో కిరణ్మయి పాత్రకు సూటవుతానని నమ్మి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’లో అవకాశం అందుకున్నా. 

మజ్ను’ మినహాయిస్తే మీరు నటించిన చిత్రాలు అంతగా సక్సెస్‌ కాలేదు. అయినా స్టార్‌ హీరోల 
సరసన అవకాశం అందుకున్నారు? 
సక్సెస్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కష్టమే. సినిమా ఫెయిల్‌ అయినంత మాత్రాన అందులో నటీనటులు, వారి నటన ఫెయిల్‌ అయిందనుకోకూడదు. నా నటన నచ్చబట్టే స్టార్‌ల పక్కన అవకాశాలు వచ్చాయని నేననుకుంటున్నా. చేసిన పాత్ర పండినా సినిమాకు టాక్‌ బాగోకపోతే. సంతృప్తి ఉండదు. అది నాకూ ఉంది. కష్టాల నుంచే సక్సెస్‌ మొదలవుతుందని భావిస్తున్నా. అపజయం నేర్పించే పాఠం ఎప్పటికీ మరచిపోలేము.
 
ఓ సినిమా అంగీకరించాలంటే మీ ప్రయారటీ ఏంటి?
ఒక సినిమాకు సైన్‌ చెయ్యాలంటే ఒక్క ఎలిమెంట్‌ని బేస్‌ చేసుకోకూడదు. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. హీరో, డైరెక్టర్‌, సాంకేతిక నిపుణులు, బ్యానర్‌ అన్నీ ముఖ్యమే. పక్కాగా అన్నీ కుదిరితేనే అది మంచి సినిమా అవుతుంది. ‘అజ్ఞాతవాసి’ అంగీకరించడానికి స్టార్‌ హీరో, పవన్‌కల్యాణ్‌ ఉన్నారనో, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఉన్నారనో చెప్పొచ్చు. కానీ నేను వారితోపాటు కథ గురించి ఆలోచించి ఓకే చేశా. ‘అత్తారింటికి దారేది’ ప్రణీత తరహా పాత్ర అయితే నేను చెయ్యననే ముందే చెప్పేశా. అలా ఉండదనీ తివిక్రమ్‌గారూ మాటిచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవచ్చు కానీ నాకు, కీర్తికి మంచి పేరే వచ్చింది. 

గీత గోవిందం చెయ్యలేకపోయినందుకు ఫీలయ్యారా? 
చాలా ఫీలయ్యా. ‘గీత గోవిందం’లో కథానాయికగా ఫస్ట్‌ చాయిస్‌ నేనే. కానీ అదే సమయంలో ‘నా పేరు సూర్య’ సినిమా చెయ్యడం వల్ల డేట్స్‌ క్లాష్‌ వచ్చింది. అందుకే ఆ సినిమా చెయ్యలేకపోయా. కానీ పరశురామ్‌గారు అతిథి పాత్ర ఇచ్చారు. అదైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. ఫైనల్‌గా చూస్తే గీత గోవిందం’ పాత్ర మిస్‌ అవ్వడం చాలా బాధగా ఉంది. 
Shailaja Reddy Alludu movie review: This Naga Chaitanya film is a ...Sailaja Reddy Alludu (2018) | Cast & Crew | News | Galleries ...

‘శైలజారెడ్డి అల్లుడు’ సంతృప్తి కలిగించిందా? 
‘మజ్ను’ తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎందుకంటే ఇందులో నటనకు స్కోపుంది. నిజజీవితంలో నాకు ఈగో ఎక్కువ. ఈ చిత్రంలో అనూ పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఇందులో బాడీ లాంగ్వేజ్‌, క్యారెక్టర్‌ యాటిట్యూడ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో నేను పెద్దగా మాట్లాడింది లేదు. ఇందులో కాస్త లౌడ్‌ క్యారెక్టర్‌ దక్కింది. అందుకే కనెక్ట్‌ అయ్యి నటించా. కానీ సినిమాలో చూపించినంత ఈగోయిస్ట్‌ని కాదు. మంచైనా, చెడు అయినా ఒకరి సలహా తీసుకోవడం నాకు నచ్చదు. నాకు నచ్చినట్లుగా ముందుకెళ్తా. ఇది చెయ్యొచ్చు అని నా మనసుకి అనిపిస్తే చేసేస్తా. కానీ రమ్యకృష్ణగారితో పనిచేశాక ఆ పద్దతి తప్పని తెలుసుకున్నా. నాకు తెలియకుండానే ఆమె దగ్గరకు వెళ్లి అడిగి మరీ సలహాలు తీసుకున్నా. ఆమెలోని గ్రేస్‌ చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఆవిడ నటన, డెడికేషన్‌ చూశాక ఉరకే ఎవరూ స్టార్స్‌ కారు అనిపించింది. ఈ సినిమా వర్కింగ్‌ ప్రాసెస్‌, నేను పోషించిన పాత్రను చాలా ఎంజాయ్‌ చేశా. 

సినిమా ఇండస్ట్రీ అడుగుపెట్టాక మీలో వచ్చిన మార్పు? 
పెద్ద మార్పేమీ లేదు. నేను నాలాగే ఉండటానికి ఇష్టపడతా. అలాగే ఉన్నా. పరిస్థితుల్ని బట్టి మారాలి,  మార్పును స్వీకరించాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎక్కడి నుంచో వచ్చినవాళ్లు ఏ సపోర్ట్‌ లేకుండా ఇక్కడ ఎదగడం అంత ఈజీ కాదు. చాలా కృషి చెయ్యాలి. ఏ ఇండస్ట్రీలోనైనా ఓ సాధారణ మనిషి ఎదగాలి అంటే చుట్టూ ఉన్న మనుషుల్ని హ్యాండిల్‌ చెయ్యడం నేర్చుకోవాలి. అందుకు నేను చదివిన సైకాలజీ బాగా ఉపయోగపడుతోంది. నేను భయపడేది ఫెయిల్యూర్‌కి మాత్రమే. ఈ ఫీల్డ్‌లో జయాపజయాలు సహజం. ఏదీ మన చేతిలో ఉండదు. సక్సెస్‌ వస్తే గోల్డెన్‌ లెగ్‌, లేకపోతే ఐరెన్‌లెగ్‌ అంటారు. ఇలాంటి వాటిని జయించాలనే తపన బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో వీటిని విని వదిలేయాలి తప్ప ఇంటి వరకూ తీసుకెళ్లకూడదనిపిస్తుంది. కంట్రోల్‌ చెయ్యడం కూడా ఎవరి వల్లా కాదని నా ఫీలింగ్‌. జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడుతున్నా.  

‘అజ్ఞాతవాసి’ మినహా అన్ని సినిమాల్లోనూ లిప్‌లాక్‌ చేసినట్లున్నారు? 
కమర్షియల్‌ సినిమాకు గ్లామర్‌ హంగు తప్పనిసరి అన్నది ఓ సూత్రం. కాబట్టి కథ డిమాండ్‌ మేరకు స్కిన్‌ షో, లిప్‌లాక్‌ లాంటివి తప్పనిసరి. కావాలని ఇరికించే సన్నివేశాలు కావవి. 

నటిగా ఎవరి ప్రభావమైన మీపై ఉందా? 
ఎలాంటిదేమీ లేదు. నటి అయినా, వేరే రంగంవారైనా వాళ్లకంటూ ఓ స్టైల్‌ ఉండాలని 
నమ్ముతా. మరొకరిని చూసి ఇన్‌స్ఫైర్‌ కావచ్చు. అది అన్ని సందర్భాల్లోనూ కాకూడదు. నాకు శ్రీదేవి, మాధురిదీక్షిత్‌, సమంత అంటే చాలా ఇష్టం. నటిగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలన్నది నా ఆకాంక్ష. 

డ్రీమ్‌ రోల్స్‌ ఏమన్నా ఉన్నాయా? 
డ్రీమ్‌ రోల్స్‌ ఏమీలేవు కానీ ‘మహానటి’లో కీర్తి సురేశ్‌లాంటి పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఆ పాత్ర తనని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆర్టిస్ట్‌ కెరీర్‌ టర్న్‌ అవ్వాలంటే అలాంటి ఓ క్యారెక్టర్‌ పడాల్సిందే. నాకు ప్రయోగాలు చెయ్యాలని లేదు. ఎవర్నీ పోటీగా భావించను. ఇంకా నేను నేర్చుకునే ప్రాయంలోనే ఉన్నా. 

మీలో మీకు ప్లస్‌ అనిపించేది? 
ఇండిపెండెంట్‌గా ఉండటం, బోల్డ్‌నెస్‌ నాలో నాకు నచ్చిన గుణాలు. ఇక నాలో ప్లస్‌ పాయింట్‌ అంటే నా కళ్లే. అవి పెద్దగా గుండ్రంగా ఉంటాయని చిన్నప్పటి నుంచీ అందరూ చెబుతుంటారు. సినిమా అభిమానుల నుంచి వచ్చిన కాంప్లిమెంట్‌ కూడా అదే. జాలి గుణం కూడా కాస్త ఎక్కువే. 

మీ హీరోల్లో మీకు నచ్చింది? 
నేను పనిచేసిన ప్రతి ఒక్కరిలో డెడికేషన్‌ని బాగా  ఇష్టపడతా. పవన్‌కల్యాణ్‌,గారు, బన్నీ, నాని, చైతూ, రాజ్‌ తరుణ్‌ ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టైల్‌ నటన. 

మీకు నచ్చినవి.. నచ్చనివి? 
ఒత్తిడి అంటే అస్సలు నచ్చదు. నాకు సినిమా మేకింగ్‌లో ఉన్న కిటుకులు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. నిర్మాత అవ్వాలనీ ఉంది. కానీ ఎప్పుడో తెలీదు. 
నా హీరోలు– నా మాట
పవన్‌ కల్యాణ్‌: మంచితనం
అల్లు అర్జున్‌: సిన్సియర్‌                                                                
నాని: రొమాంటిక్‌ పర్సన్‌
నాగ చైతన్య: కంఫర్టబుల్‌ కోస్టార్‌
గోపీచంద్‌: కామ్‌ గోయింగ్‌ పర్సన్‌
నా యిష్టాలు: 
ఇష్టమైన ప్రదేశం: ఇల్లు
ఆహారం: ఒకటని చెప్పడం కష్టం. కానీ చైనీస్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. 
ఇష్టమైన సినిమా: నోట్‌బుక్‌(ఇంగ్లిష్‌)
ఇష్టమైన పుస్తకం: వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌
హాబీస్‌: షాపింగ్‌, ట్రావెలింగ్‌ 
Anu Emmanuel: 5 exquisite pictures of the actress that will leave ...Anu Emmanuel wallpaper by Gurusad - 64 - Free on ZEDGE™

బాక్స్‌:
1. చిన్నప్పటి నుంచీ నా తల్లిదండ్రులు నచ్చింది చేసే స్వేచ్ఛనిచ్చి పెంచారు. యాక్టింగ్‌ కెరీర్‌గా ఎంచుకోవడం కూడా నా ఇష్టప్రకారమే జరిగింది. వాళ్లు నన్ను ఎంకరేజ్‌ చేశారు.
 
2. నేను చాలా బోరింగ్‌ పర్సన్‌ని. ఖాళీగా ఉండే రోజంతా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతా. ఒంటరిగా కూర్చుని సినిమాలు చూస్తా లేదంటే ప్రశాంతగా పడుకుంటా. షాపింగ్‌ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచీ ఒంటరిగా ఉండటం అలవాటు అయింది. అందుకే నాకు స్నేహితులు కూడా చాలా తక్కువ. 

3.  స్టైలింగ్‌ విషయంలో నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. మూడ్‌ని బట్టి దుస్తులు ధరిస్తా. క్లాసిక్‌ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. నా చర్మం త్వరగా డ్రై అయిపోతుంది. అందుకే ఎక్కువగా లోషన్స్‌ ఉపయోగిస్తా. 

4.  నేనంత ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ని కాదు. కథానాయికకు కావలసిన ఫిట్‌నెస్‌ ఉండేలా చూసుకుంటా. అదే పనిగా వర్కవుట్స్‌ చెయ్యను. వారానికి రెండుసార్లు జిమ్‌ చేస్తానంతే.
 
5. పుస్తకాలు చదువుతా. కానీ పుస్తకాల పురుగును కాదు. నచ్చిన పుస్తకం చదవడంలో ఉన్న కిక్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తా. సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ పుస్తకాలు చదువుతా. వాటి నుంచీ చాలా నేర్చుకుంటా. ఒప్రా విన్‌ఫ్రే  రచించిన ‘వాట్‌ ఐ నో ఫర్‌ ష్యూర్‌’ నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం. 
వజ్రాలు, పప్పీస్

Comments

Post a Comment

Popular posts from this blog

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక