Skip to main content

ఆ రెండు సమస్యలతో బాధపడుతున్నా!

Shruti Haasan Look Gorgeous As She Flaunts In Her Black Outfit In ...

 
స్టార్‌ కిడ్‌ అంటే.. కెరీర్‌ నల్లేరు మీద నడక అంటుంటారు!
మొదట ఆ నడక నేర్వాలి, నిలవాలి, గెలవాలి!
స్టార్‌కిడ్‌ అయినా సున్నా నుంచి మొదలుపెట్టి, పట్టుపట్టి గెలిచారు కమల్‌హాసన్‌ గారాలపట్టీ శ్రుతీహాసన్‌. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన సత్తా చాటుతున్నారు. లాక్‌డౌన్‌లో శ్రుతీ ఏం చేశారో ఆమె మాటల్లోనే...

నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తికావొస్తుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఓ కథానాయిక పదేళ్లు కొనసాగిందంటే మామూలు విషయం కాదు. ఈ రంగంలో ముందు, వెనక చెడు ఏదో ఒక రూపంలో కూర్చుని ఉంటే, మంచి మాత్రం ఒంటరిగా మన పక్కన ఉంటుంది. అంటే 10మందిలో ఒకరిద్దరు మంచి మనసు ఎదుటివారిని అర్థం చేసుకునేవారు ఉంటారని నా ఉద్దేశం. నా దగ్గర మంచిగా మాట్లాడి.. పక్కకు వెళ్లి ఇంకోలా మాట్లాడిన వాళ్లని చాలామందిని చూశా. మొదటి మూడు సినిమాలకే ఆ విషయాలన్నీ గమనించాను కాబట్టే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండగలిగా. 

తల పొగరు చూడలేదు...
కెరీర్‌ బిగినింగ్‌లో ఎక్కువ కమర్షియల్‌ సినిమాల వైపే అడుగులేశా. నేను ఇండిపెండెంట్‌గా ఆలోచించే అమ్మాయిని. ఆ టైమ్‌లో నన్ను ఎవరూ గైడ్‌ చేయలేదు. ప్రతి చిన్న విషయం కోసం నాన్నని అడగలేను. మొదట్లో    మెయిన్‌ స్ట్రీమ్‌లో ఉండాలనే యాంగ్జైటీతో కమర్షియల్‌ సినిమాలు చేశా. అది పొరపాటని తర్వాత తెలిసింది. అలాగని అక్కడ నాకు చెడ్డ పేరు ఏమీరాలేదు. సక్సెస్‌ వచ్చినప్పుడు ఆనందపడతా. ఫెయిల్‌ అయిన సినిమా గురించి ఆలోచించి బాధపడను. ఎందుకంటే సినిమా సక్సెస్‌ ఒకరి చేతిలో ఉండదు. టీమ్‌ వర్క్‌ అది. నా ఒక్కరితోనే ఫ్లాప్‌ అయిందని నేననుకోను. పరాజయం పాలైన సినిమాలో ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకుంటా. పదేళ్ల జర్నీలో తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేశా. అది కూడా పవన్‌ కల్యాణ్‌, సూర్య, ధనుష్‌, రవితేజ ఇలా చాలామంది హీరోలతో రెండేసి సినిమాల్లో నటించా. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టైల్‌. వారంతా సక్సెస్‌ఫుల్‌ హీరోలే. వారి నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. వీరందరి స్టైల్‌ డిఫరెంట్‌ అయినా కామన్‌ క్వాలిటీ మాత్రం ఒకటుంది. స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్నా... చేసే పనిలో క్లారిటీ ఉంది. ముఖ్యంగా తల పొగరు ఎవరిలోనూ చూడలేదు. 

ఎమోషన్స్‌ని కవర్‌ చేస్తున్నా... 
నాలో విలక్షణమైన నటి, సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇలా చాలా కోణాలు ఉన్నాయని అందరూ అంటారు. మ్యూజిక్‌ వరకూ నన్ను ఎంత ప్రశంసించినా ఆనందంగా తీసుకుంటా. కానీ నటన పరంగా ఇప్పటికీ స్ట్రగుల్‌ అవుతున్నా. నా ఫేషియల్‌ ఫీచర్‌ బాగోలేదా? నా వైఖరి కరెక్ట్‌గా లేదా? అన్నది అర్థం కాదు. ఎవరన్నా చెబితేనే కదా తెలుస్తుంది. హీరోయిన్‌ కావలసిన ఫీచర్స్‌ నాలో ఉన్నాయి. నన్ను ఎలా క్యాస్ట్‌ చేసుకోవాలో, ఎలాంటి క్యారెక్టర్‌కి నేను సరిపోతానో ఇప్పటికీ క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ తెలుసుకోలేకపోతున్నారని నా అభిప్రాయం. అయితే నాలో ఆ అసంతృప్తి ఉన్నా ఈ కెరీర్‌ని చాలా ఇష్టపడతాను. మేమంతా ప్రేక్షకుల చప్పట్ల కోసం పనిచేస్తాం. యాక్టింగ్‌ అనేది డ్రగ్‌ కాదు మార్కెట్‌కి వెళ్లి కొని తెచ్చుకోవడానికి? అదొక సాధన, కష్టపడి సంపాదించుకోవాలి. నటిగా ఎంతో నేర్చుకుని, కోట్లాదిమంది సినీ అభిమానుల మధ్య నటిగా నిరూపించుకున్నా. ఆ విషయంలో మాత్రం ఆనందంగా ఉన్నా. నిజం చెప్పాలంటే యాక్టింగ్‌ అనేది నా జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. లైఫ్‌లో నేను చేసిన పెద్ద తప్పు కూడా యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకోవడమే అనిపిస్తుంది. బిగినింగ్‌ నుంచీ ఇప్పటి దాకా ఎమోషన్స్‌ని కవర్‌ చేసుకుంటూనే కొనసాగుతున్నా. నేను స్టార్‌ కిడ్‌నే కానీ.. నేనింకా స్టార్‌ కాలేదని నా అభిప్రాయం.

shrutihassansexy Instagram posts - Gramho.com
సంగీతమే నా జీవితం..
సంగీతానికి సంబంధించి ఏ విషయమైనా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. నా శ్వాసలో సంగీతం ఉంది. నటనలో నా ఎమోషన్స్‌ పూర్తిగా బయటకు తీయలేదేమో కానీ సంగీతం మాత్రం నాలో ఉన్న ఎమోషన్స్‌ మొత్తాన్ని బయటకు తీయగలదు. నాకు సంగీతానికి అంతటి అనుబంధం ఉంది. హిందూస్థానీ సంగీతం బాగా నేర్చుకున్నా. వెస్ట్రన్‌ సంగీతంపై ఎక్కువ ప్రయోగాలు చేయాలనుకుంటా. సంగీతమే నా జీవితం. 
ఆ సమస్యతో బాధపడుతున్నా...
నాలో రెండు సమస్యలున్నాయి. ఒకటి ఓవర్‌ యాంగ్జైటీ, రెండోది హార్మోన్లలో సమతుల్యత లేకపోవడం. మామూలుగా నేను చాలా ప్రశాంతంగా ఉంటా. కొన్ని సందర్భాల్లో ఏదైనా వింటే ఓవర్‌ యాంగ్జైటీ ఫీలవుతా. అదే నాకున్న పెద్ద సమస్య. వ్యాయామాల ద్వారా వాటికి మెల్లగా దూరం అవుతున్నా. నెగటివ్‌గా ఆలోచించడం, ఎదుటివ్యక్తిని ద్వేషించడం నాకు నచ్చదు.
 
లాక్‌ డౌన్‌ కుకింగ్‌ టైమ్‌ 
ముంబైలో ఉంటున్నా దక్షిణాది వంటకాలనే ఇష్టపడతా. వంట కూడా బాగానే చేస్తా. వంట నేర్చుకోవడానికి అసలు కారణం ఏంటంటే.. ఓసారి సూర్య సినిమా షూటింగ్‌ కోసం అమెరికా వెళ్లా. అక్కడ ఓ రెస్టారెంట్‌లో నాకెంతో ఇష్టమైన ఇడ్లీ, సాంబార్‌ ఆర్డర్‌ చేస్తే 20 డాలర్లు (అప్పట్లో 1500కు పైగా)బిల్‌ వేశారు. నా కళ్లు గిర్రున తిరిగాయి. ఆ షూటింగ్‌ పూర్తయి ఇంటికి రాగానే వంట మీద బాగా దృష్టిపెట్టా. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల వంటింట్లో మరిన్న ప్రయోగాలు చేశా. నేను ఏదన్నా తినాలనుకుంటే ముందు దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుంటా. బెండకాయ పచ్చడి, పప్పు మామిడికాయ, ఇడ్లీ, సాంబార్‌, నూడిల్స్‌, దోశ అలాగే ఇంట్లో రెగ్యులర్‌గా వండే వంటకలు బాగా చేస్తా. దాదాపు 15 ఏళ్ల తర్వాత కాఫీ తాగా. టేస్ట్‌ బాగుంది. కానీ వింతగా అనిపించింది. అందుకే మళ్లీ నా గ్రీన్‌ టీకే ఓటేద్దామనుకుంటున్నా. 

అది అమ్మనే అడగండి..! 
అమ్మ మంచి యాక్టర్‌ అని అందరికీ తెలుసు. నటిగా ఆమెకు ఇంకా భవిష్యత్తు ఉన్నప్పటికీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటుందో ఆమెనే అడగాలి. అమ్మా, నేను కలిసి నటించే అవకాశం వస్తే ఆనందమే! అది జరగొచ్చు... జరగకపోవచ్చు. ఇక చెల్లి అక్షరాహాసన్‌ విషయానికొస్తే.. నాలాగే ఇండిపెండెంట్‌ అమ్మాయి. ‘షమితాబ్‌’తో మంచి పేరు తెచ్చుకుంది. నా సలహాలు ఏమీ తను తీసుకోదు. నేనూ సలహాలివ్వను. అమ్మ ఏం చెబితే అది చేస్తుంది. నాన్న హావభావాలు తనలో ఎక్కువగా కనిపిస్తాయి. నిజ జీవితంలో నాన్న మంచి స్టోరీ టెల్లర్‌. అమ్మ కూడా బెస్ట్‌ సపోర్టర్‌. వారిద్దరిలో ఉన్న కరేజ్‌ నేనెక్కడ చూడలేదు. 

Shruti Haasan to release album with British alt-rock band!

రెండు జళ్ల శ్రుతీ
లాక్‌డౌన్‌ టైమ్‌లో అసలు ఖాళీగా లేను. మనసంతా మ్యూజిక్‌ చుట్టే తిరిగేది.. పియానోతో రోజుకో ట్యూన్‌ చేస్తుండేదాన్ని. నా మ్యూజిక్‌ రూమ్‌ని శుభ్రంగా సిద్ధం చేశా. అభిమానుల కోసం కొన్ని ట్యూన్స్‌ చేసి, పాటలు పాడి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశా. ఇదే టైమ్‌లో ఓ రోజు రెండు జడలు వేసుకుని పియానో వాయిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశా. రెండు జడల శ్రుతీ చాలా బావుందని అభిమానులు కామెంట్లు చేశారు. ప్రస్తుతం నేను చేస్తున్న రవితేజ  ‘క్రాక్‌’, విజయ్‌ సేతుపతి ‘లాభం’ చిత్రాల్లో నా పాత్ర నిజ జీవితంలో నేనెలా ఉంటానో అలాగే ఉంటుంది.

Comments

Popular posts from this blog

చొక్కాలు చింపుకోవడానికి రెడీ!

చొక్కాలు చింపుకోవడానికి రెడీ! నితిన్‌ తెరపై ఎనర్జిటిక్‌ హీరో...  తెర వెనక మహా సిగ్గరి.. అలాంటి యువకుడికి ఎనిమిదేళ్ల ప్రేమ కథ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కథేంటో చూద్దాం... హాయ్‌ నితిన్‌ కంగ్రాట్స్‌! త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు?  థ్యాంక్స్‌ అండీ! ఏపిల్ర్‌ 16న షాలిని కందుకూరితో నా వివాహం జరగబోబోంది.  పెళ్లికి సిద్ధమవుతున్నారు. మరో పక్క ‘భీష్మ’.. సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ అంటున్నారు?  యాక్చువల్లీ ఈ సినిమా ఏడాది క్రితం మొదలవ్వాలి. కథ మీద ఎక్కువ వర్క్‌ చేయాలని కొంత టైమ్‌ తీసుకున్నాం. ‘భీష్మ’ తర్వాత పెళ్లి ప్లాన్‌ చేసుకున్నా.  సినిమా కాస్త ఆలస్యం అయింది. ఇంకా పెళ్లి డిలే చేస్తే నాకు కాబోయే భార్య తంతుందని పెళ్లికి తొందరపడ్డా.  ‘భీష్మ’ ఏం చేస్తాడు? ఇందులో హీరోకి గర్ల్‌ఫ్రెండ్‌ ఉండాలని కోరిక. చిన్నతనం నుంచి అతని ప్రయత్నం ఏ రోజూ ఫలించలేదు. ఏ అమ్మాయి అతనికి పడేది కాదు. అలాంటి వ్యక్తికి  ఓ అందమైన అమ్మాయి పరిచయమైతే.. ఆమెను ఎలా సాధించుకున్నాడు అన్నది ఈ సినిమా ఇతివృత్తం. అంతే కాకుండా ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అనే లేయర్‌ కూడా ఈ సినిమాలో ఉంది. ‘దిల్‌’ తర్వాత అలాంటి కమర్షియల్‌ జోన్‌లో చేస్తున్న సినిమా ఇది.  ‘లై

ఆ పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా!

ఆ   పరిస్థితి ఎదురైతే.. వెళ్లి జాబ్‌ చేసుకుంటా! చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు... సినిమాల్లో హీరోయిన్‌ అందాన్ని వివరించడానికి హీరో ఇలా చాలా మాటలు చెబుతుంటాడు. అనుపమ  పరమేశ్వరన్‌ని చూేస్త ప్రేక్షకులు అలాగే చెబుతారు. అలాంటి అందం ఆమెది.   అనుపమ తన కెరీర్ గురించి చెప్పిన సంగతులు  కేరళాలోని త్రిస్సూర్‌ జిల్లాలోని ఇరింజ్యాలకుడ టౌన్‌లో పుట్టాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మలయాళీ అమ్మాయిని. నాన్న పరమేశ్వరన్‌. ప్రైవేట్‌ ఉద్యోగి. అమ్మ సునీత గృహిణి. తమ్ముడు అక్షిత్‌.  అమ్మనాన్న చాలా ఇండిపెండెంట్‌. చిన్నప్పుడు గారాబంగా నన్ను పెంచలేదు. ఏదన్నా పనుంటే స్వతహాగా చేసుకోవాలనేవారు. నా వల్ల కాని పని ఏదన్నా ఉంటే వాళ్లు హెల్ప్‌ చేసేవారు.  అల్లరి అంటే నాపేరే.. మాది చిన్న టౌన్‌ లాంటిది. మా ఊరంటే ప్రాణం నాకు. ఊరి పక్కనే ‘కుడాల్‌ మాణిక్యం’ దేవాలయం ఉంది. మార్చి, ఏప్రిల్‌ నెలలో పది రోజులపాటు ఏనుగుల మీద ఊరేగింపుతో ఘనంగా పండుగ జరుగుతుంది. మా కుటుంబానికి చాలా ముఖ్యమైన పండుగ అది. చిన్నప్పటి నుంచీ చాలా అల్లరి పిల్లని. స్కూల్లో, కాలేజ్‌లో ఎప్పుడూ క్లాస్‌ బంక్‌ కొట్దిం

చివరి శ్వాస వరకు నటిస్తా

చివరి శ్వాస వరకు నటిస్తా  – మురళీమోహన్‌ ‘‘సినిమా పరిశ్రమ అర్హతను మించి ఒక్కో మెట్టు ఎక్కించింది. అందుకే పరిశ్రమకు నేనెప్పుడూ దూరంకాను. రాజకీయాల్లో ఉన్నా మొదటి ప్రాధాన్యం సినిమాకే ఇస్తా. అక్కినేని నాగేశ్వరరావు గారిలా చివరిశ్వాస వరకూ నటుడిగా కొనసాగుతాను’’ అంటున్నారు మురళీమోహన్‌. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో రంగాల్లో అడుగులేసిన ఆయన ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ ఆయన మనసు మాత్రం సినిమా పరిశ్రమ చుట్టూనే తిరుగుతోంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా నటనను వదలననీ, క్యారెక్టర్స్‌ ఇస్తే నటుడిగా విజృంభిస్తాననీ ఆయన అంటున్నారు. అమ్మే నా గురువు ఏలూరు టౌన్‌కి దగ్గర్లో ఉన్న చాటపర్రు గ్రామంలో 1940 జూన్‌ 24న మాగంటి మాధవరావు, వసుమతిదేవి దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బుద్ధిమంతుడిలా పెంచారు. భక్తి గురించి ఎక్కువగా నేర్పించారు. అమ్మే నా మొదటి గురువు. ఆవిడ క్రమశిక్షణలో నాన్న గైడెన్స్‌లో మంచి వ్యాపారవేత్తను అయ్యాను. ఉత్తమ విద్యార్థిని కాలేకపోయాను. మా నాన్న, బాబాయ్‌లు, మేనమావలు అందకూ కూడా వ్యాపారం రంగంలోనే ఉండటంతో ఆ ప్రభావం నాపై పడిందనుక